LIVE : రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2024, 11:57 AM IST

Updated : Oct 19, 2024, 1:21 PM IST

CM Chandrababu Restarts Amaravati Works Live : అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శ్రీకారం చుట్టనున్నారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం సమీపంలోని AP CRDA ప్రాజెక్టు కార్యాలయం పనులను తిరిగి ప్రారంభించనున్నారు. దీంతో రాజధాని పనులను ప్రభుత్వం తిరిగి ప్రారంభించినట్లవుతుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు స్వయంగా పనులు ప్రారంభిస్తారు. 160 కోట్ల రూపాయలతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను CRDA చేపట్టింది. ఈ నెల 16న జరిగిన CRDA సమావేశంలో పనుల ప్రారంభంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవి పునఃప్రారంభం కానున్నాయి.గత బుధవారం సీఆర్డీఏ 36వ అథారిటీ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు, ప్రస్తుత పరిస్థితి సహా మెుత్తం 12 అంశాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. గతంలో భూమి పొందిన వారు, మళ్లీ నిర్మాణాలు చేపట్టే అంశంపై అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. ఎవరికి భూములు కేటాయించాలి, ఏపీ ఎడ్యుకేషన్ హబ్‌గా అయ్యేందుకు ఎలాంటి సంస్థలను ఆహ్వానించాలనే అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణ పనులను  సీఎం చంద్రబాబు పునఃప్రారంభిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Oct 19, 2024, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.