చిరుతదాడిలో ఆడదూడ మృతి- భయాందోళనలో స్థానికులు - Cow Calf Died by Cheetah Attack
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-03-2024/640-480-20877764-thumbnail-16x9-cheetah-attack.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 1:15 PM IST
Cheetah Attack on Cow Calf in Anantapur District : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో చిరుత దాడిలో ఆవుదూడ మృతి చెందింది. చాపరి గ్రామ శివారులో ధనుంజయ అనే రైతు తన పొలంలోనే నివాసం ఉంటున్నాడు. తన నివాసానికి కొంత దూరంలో ఆవుదూడను కట్టివేసి ఉండగా, తెల్లవారుజామున అకస్మాత్తుగా చిరుత దాడి చేసింది. ధనుంజయ లేచి చూస్తేసరికి ఆవుదూడ మృతిచెందింది.
Cow Calf Died by Cheetah Attack in Kalyandurgam : చిరుత దాడిలో ఆవుదూడ మృతి చెందిన విషయాన్ని అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో అటవీ శాఖ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల వివరాలు సేకరిస్తున్నారు. ఈ సంఘటనతో చుట్టుప్రక్కల పశువుల కాపరులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు చర్యలు తీసుకొని చిరుతను బంధించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో కూడా చిరుత దాడిలో మూడు మేకలు మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులకు స్థానికులు తెలియజేశారు.