thumbnail

LIVE: పెనుగొండ నియోజకవర్గంలో 'రా.. కదలిరా' సభ - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 3:09 PM IST

Updated : Mar 4, 2024, 5:28 PM IST

Chandrababu Raa Kadali Ra Public Meeting: నేడు హిందూపురం పరిధిలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పెనుగొండ నియోజకవర్గంలో 'రా.. కదలి రా' బహిరంగ సభ జరుగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో తెలుగుదేశం నిర్విహిస్తున్న రా కదలిరా బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు ఇప్పటికే టీడీపీ నేతలు తెలిపారు. లక్షలాది మంది కార్మికులు, కర్షకులు, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధినేత చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. టీడీపీ నేతలు దగ్గరుండి సభా ఏర్పాట్లు అన్నీ పరిశీలించారు. కియా పరిశ్రమకు అతీ సమీపంలో సభా వేదిక ఏర్పాటు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు తలపెట్టిన ‘రా కదలి రా’ సభలు నేటితో ముగియనున్నాయి. రా కదలి రా సభలు టీడీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపాయి. ఈ నేపథ్యంలో పెనుకొండలో ముగింపుసభకు భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. టీడీపీ జెండాలతో పెనుకొండ పసుపు మయమైంది. త్వరలో ప్రజాగళం పేరిట మలివిడత ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. పెనుగొండలో జరుగుతోన్న రా కదలిరా బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Mar 4, 2024, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.