మాట నిలబెట్టుకున్న చంద్రన్న- ఆరుద్ర కూతురు వైద్యానికి ₹ 5 లక్షల సాయం - Chandrababu Announces 5 Lakh aid - CHANDRABABU ANNOUNCES 5 LAKH AID

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 10:18 AM IST

Chandrababu Naidu Announces ₹5 Lakh Aid, Monthly Pension to Arudra Daughter : వైఎస్సార్సీపీ హయాంలో నరక యాతన అనుభవించిన కాకినాడకు చెందిన ఆరుద్రకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నేరవేర్చారు. వెన్నుపూస తీవ్రంగా దెబ్బతిని అచేతనమై, వీల్ చైర్‌కే పరిమితమైన ఆరుద్ర కూతురు సాయిలక్ష్మీచంద్ర వైద్యం కోసం ప్రభుత్వం రూ. 5 లక్షల సాయాన్ని అందజేశారు. సచివాలయంలో బాధితులకు సీఎంఓ (CMO) అధికారులు చెక్‌ను అందజేశారు. జగన్‌ ప్రభుత్వంలో తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని, నాడు ప్రతిపక్ష నేతగా అండగా నిలిచిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అన్ని విధాలా ఆదుకున్నారని ఆరుద్ర తెలిపారు.

గత ప్రభుత్వంలో మంత్రి దాడిశెట్టి రాజా వద్ద గన్ మెన్లుగా పని చేస్తున్న కానిస్టేబుళ్లు, తనను తీవ్రంగా వేధించడంతో అప్పట్లో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఆరుద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. మంత్రి అండతో తనను వేధిస్తున్న వారి పై కేసులు పెట్టాలని కోరితే తన పైనే అక్రమ కేసులు నమోదు చేసి వేధించిన్నట్లు బాధితురాలు గుర్తు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.