విజయవాడలో 'విధ్వంసం' పుస్తకావిష్కరణ - హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ - ప్రత్యక్షప్రసారం - చంద్రబాబు లైవ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 7:18 PM IST

Updated : Feb 15, 2024, 9:26 PM IST

Chandrababu and Pawan Kalyan at Book Launch Event: తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లు (Jana Sena Chief Pawan Kalyan) ఒకే వేదికను పంచుకున్నారు. ఈ రోజు విజయవాడలో ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఇరువురు నేతలు హాజరయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం‘ పుస్తకాన్ని నగరంలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్​లో ఆవిష్కరించారు. చంద్రబాబు పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని పవన్ అందజేయనున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై ఆలపాటి సురేష్ కుమార్ పుస్తకంలో పొందుపరిచారు. మొత్తం 185 అంశాలతో పుస్తకాన్ని రూపొందించారు.

ప్రజా చైతన్యానికి అక్షరమే ఆయుధంగా నిలవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను వ్యాసాల రూపంలో వెలుగులోకి తీసుకొస్తూ సీనియర్ జర్నలిస్ట్ నీరుకొండ ప్రసాద్ రాసిన ‘అక్షరాస్త్రం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు.

Last Updated : Feb 15, 2024, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.