మదనపల్లిలో బాబాజీ ఆలయం ముస్తాబు- ప్రారంభించనున్న కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ - Nitin Gadkari Visit babaji Temple - NITIN GADKARI VISIT BABAJI TEMPLE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 16, 2024, 7:09 PM IST

Updated : Jul 16, 2024, 8:21 PM IST

Central Minister Nitin Gadkari Will Come to Madanapalle on Wednesday: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెకు రానున్నారు. మదనపల్లె పట్టణంలోని నక్కల దీన్నే సమీపంలో సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆదినాథ్ శ్రీ గురు మహావతార బాబాజీ (Adinath Shri Guru Mahavatara Babaji) ఆలయాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.45 నిమిషాలకు నితిన్ గడ్కరీ​ తిరుపతి చేరుకుని అక్కడ నుంచి మదనపల్లికి హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత సాయంత్రం ఆయన తిరుపతికి బయలుదేరనున్నారు.

కేంద్ర మంత్రి బాబాజీ ఆలయానికి రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఆలయం వద్ద ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బాబాజీ ఆలయ నిర్మాణం మొత్తం పూరైంది. ఆలయం చుట్టూ ప్రత్యేక ఆకర్షణగా లైటింగ్​ను ఏర్పాటు చేశారు. భక్తులు బాబాజీని దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రారంభోత్సవం అనంతరం కేంద్రమంత్రి ప్రసంగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

Last Updated : Jul 16, 2024, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.