రాష్ట్రానికి రీజినల్ కార్యాలయం అవసరముంది - కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం: కృష్ణమూర్తి - Water Board Krishnamurthy Interview
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 12, 2024, 1:39 PM IST
Central Ground Water Board Deputy Director Krishnamurthy Interview: రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచే విధంగా కొత్త పథకాలకు ప్రణాళికలపై చర్చించేందుకు కేంద్ర భూగర్భ జలమండలి డిప్యూటీ డైరెక్టర్ జి. కృష్ణమూర్తి బృందం జిల్లాల్లో పర్యటన సాగిస్తున్నారు. విజయవాడ, నెల్లూరులో అవగాహన సమావేశాలు నిర్వహించారు. బృందంలో కేంద్ర జలశాఖ శాస్త్రవేత్త రవికుమార్ పాల్గొన్నారు. చెక్ డ్యాములు, వాటర్ షెడ్స్ డిజైన్లపై చర్చించారు. అశాస్త్రీయంగా నిర్మాణం చేయొద్దని, ఖచ్చితంగా నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.
కేంద్ర వాటర్ బోర్డు ఆధ్వర్యంలో తెలంగాణ బచ్చన్నపేటలో, రాష్ట్రంలో పులివెందులలో ఒక్కొక్కచోట 4 కోట్ల రూపాయల నిధులతో రీఛార్జి స్ట్రక్చర్స్ నిర్మాణం చేసినట్లు తెలిపారు. దీనివల్ల ప్రస్తుతం 4 నుంచి 5 మీటర్లు వాటర్ లెవల్స్ పెరిగాయని, ఇవి వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఇటువంటి పథకాలపై సీఎం చంద్రబాబుకు మంచి అవగాహన ఉందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదారాబాద్లో మాత్రమే కేంద్ర వాటర్ బోర్డు కార్యాలయం ఉండటంతో అక్కడి నుంచి రాష్ట్రం కోసం పని చేయడం పని భారంగా మారిందన్నారు. ప్రత్యేకంగా ఏపీకి రీజినల్ కార్యాలయం అవసరం ఉందని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటున్న కేంద్ర భూగర్భ జలమండలి డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తితో ముఖాముఖి.