సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకారం - ఓయూలో టీడీపీ శ్రేణుల సంబురాలు - Celebrations of TDP leaders - CELEBRATIONS OF TDP LEADERS
🎬 Watch Now: Feature Video
Published : Jun 13, 2024, 10:13 PM IST
Celebrations of TDP leaders at OU : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్ ఉస్మానియా వర్శిటీలో బాణసంచా కాల్చి టీడీపీ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం, పుష్పాభిషేకం చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో తెలంగాణ తెలుగుదేశం యువజన అధ్యక్షుడు నర్సిరెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా జాతీయరాజకీయాల్లోనూ చంద్రబాబు నాయకత్వం అత్యంత అవసరమని నాయకులు కొనియాడారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ పార్టీ పూర్వవైభవం సంతరించుకుంటుందని నర్సిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను అత్యంత ఆర్ధికంగా ముందుందంటే వారు చేసిన అభివృద్ధేనని అన్నారు. తెలంగాణకు బ్యాక్ బోనుగా నిలిచి ఐటీ రంగంలో ముందు ఉండి నడిపంచారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ బీసీలకు పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీడీపీ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.