కోడ్ ఉల్లంఘన - మాజీ ఎంపీ మేకపాటిపై కేసు నమోదు - Case Filed on EX MP Mekapati - CASE FILED ON EX MP MEKAPATI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 24, 2024, 1:24 PM IST
Case Filed on EX MP Mekapati Rajamohan Reddy : మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నెల్లూరు జిల్లా మర్రిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆత్మకూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ వెంకట రమణమ్మ ఫిర్యాదు చేశారు. తాజాగా వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరానని, తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. అనుమతులు లేకుండా ప్రచారం చేయడంపై స్థానిక ఎంపీడీఓ (MPDO) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మర్రిపాడు మండలం అల్లంపాడు గ్రామంలో కొడుకు విక్రమ్ రెడ్డి గెలుపు కోసం ప్రచారానికి వెళ్లిన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు లేకుండా ప్రచారం చేయడంపై స్థానిక ఎంపీడీవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.