ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వైఎస్సార్సీపీ నేతలు - కేసు నమోదు - Election Code In Andhra Pradesh
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-03-2024/640-480-21019126-thumbnail-16x9-violation-of-election-code-in-proddatur.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 19, 2024, 11:31 AM IST
Violation of Election Code In Proddatur : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వ్యక్తులపై రెండో పట్టణ ఠాణాలో కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఆదివారం ప్రొద్దుటూరులో నిర్వహించిన నూర్ బాషా దూదేకుల సంఘం ఆత్మీయ సమావేశానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదు రెడ్డి, నాయకులు హాజరు అయ్యారు. చీరలు పంపిణీ చేస్తామని చెప్పడంతో మహిళలను భారీ ఎత్తున సభకు తరలించారు. చీరల పంపణీ కోసం మహిళలకు టోకెన్లు సైతం అందించారు.
ఈ ఘటనపై ఈటీవీ భారత్ - ఈనాడు ఈటీవీలో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ విజయరామరాజు విచారణకు ఆదేశించారు. ఎలాంటి అనుమతులు లేకుండా సమావేశం ఏర్పాటు చేయడం, ఎన్నికల కోడ్‌ను ఉల్లగించి చీరెల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన పగిడాల దస్తగిరి, నాగూర్ అనే వ్యక్తులపై పురపాలిక కమిషనర్, ఆర్‌వోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఇద్దరిపై ప్రొద్దుటూరు రెండో పట్టణ ఠాణాలో కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ విజయరామరాజు ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.