వైసీపీ అధికారంలో పేదలకు తీవ్ర ఇబ్బందులు: కేశినేని చిన్ని - Keshineni Brothers War
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-02-2024/640-480-20649825-thumbnail-16x9-keshineni-foundation.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 6:06 PM IST
Carts Distribution Under Keshineni Foundation: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని పేద మధ్యతరగతి చిరు వ్యాపారులకు కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యురో సబ్యులు బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని పాల్గొని తోపుడు బండ్లు పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి పేద, మధ్య తరగతి వర్గాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చిరు వ్యాపారులు వ్యాపారాలు లేక దివాలా తీసే పరిస్థితికి వచ్చారని అన్నారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమ వంతుగా తోపుడుబండ్లు, ఇస్త్రీ పెట్టెలు, ఇతర సామాగ్రిని పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ శివనాథ్ చిన్ని తెలిపారు.
Kesineni Chinni On Kesineni Nani: కేశినేని నానిపై విజయవాడ కేశినేని చిన్ని ఘాటు విమర్శలు చేసారు. కేశినేని నాని సైక్రియాటిస్ట్కు చూపించుకోవాలని హితవు పలికారు. కేశినేని నానితో సహా సైకోలందరూ ఒక పార్టీలో చేరారన్నారు. కేశినేని నానికి రాజకీయం అంటే ఏంటో తెలవక ముందే గద్దె రామ్మోహన్ ఎంపీ అయ్యాడని గుర్తు చేశారు. గద్దె రామ్మోహన్ స్థాయి తెలుసుకుని నాని మాట్లాడాలన్నారు. తెలుగుదేశం పార్టీకి సీట్లు అమ్ముకోవలసిన పరిస్థితి లేదని వెల్లడించారు. సైకో పార్టీలో ఉన్న వారంతా చంద్రబాబుని విమర్శించటమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.