బంజారాహిల్స్‌లో కారు అదుపు తప్పి బీభత్సం - సీసీటీవీ దృశ్యాలు వైరల్ - Car Hits Auto and Car in Hyderabad - CAR HITS AUTO AND CAR IN HYDERABAD
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2024, 2:39 PM IST
Car Hits Auto and Car in Hyderabad : హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో అదుపు తప్పిన కారు, పల్టీలు కొడుతూ ఓ కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్‌లో నిలిపి ఉంచిన కారు, ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో పూర్తిగా ధ్వంసం కాగా, కారు డ్యామేజ్ అయింది. పార్కింగ్ చేసిన కారు, ఆటోలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. షాపునకు కూడా ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
ఘటనలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారు పల్టీలు కొట్టడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాసేపు ఆ ప్రాంతంలో వాహనాలన్నీ నిలిచిపోయాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధ్వంసమైన వాహనాలను అక్కడి నుంచి తరలించారు. అనంతరం క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా, ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.