వివేకా హత్య అవినాష్‌రెడ్డి డైరక్షన్లో జరిగిందని చెప్పకనే చెప్పారు: బీటెక్ రవి - BTech Ravi on YS Avinash Reddy - BTECH RAVI ON YS AVINASH REDDY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 7, 2024, 10:47 PM IST
BTech Ravi Allegations on Avinash Reddy about Viveka Murder: వివేకా హత్య జరిగిన రోజు రక్తపు మరకలు తుడిచే సమయంలో అవినాష్ రెడ్డి చూస్తూ పిల్లాడిలా ఉన్నారు అని అనడం చాలా హాస్యాస్పదమని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. హత్య జరిగిన విషయం వివేకా బావమరిది శివ ప్రకాష్ రెడ్డి తనకు ఫోన్ చేస్తే హత్య ప్రదేశానికి వెళ్లానని చెప్పినా అవినాష్ ఆ ప్రదేశంలో ఎర్ర గంగిరెడ్డి మరకలు తుడుస్తుంటే చూస్తూ ఉన్నారని విమర్శించారు. వివేకాను హత్య చేశారు అని తెలిసినా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఏమీ చేయకపోవడం దారుణమన్నారు. హత్య చేసిన వారు సాక్ష్యాలను తారుమారు చేస్తోంటే ప్రశ్నించాలనే ఆలోచన అవినాష్‌రెడ్డికి రాలేదా అని రవి ప్రశ్నించారు. వివేకా హత్య జరిగే సమయంలో ఎర్ర గంగిరెడ్డి, అవినాష్ రెడ్డికి వాట్స్ యాప్ కాల్స్ ఉన్నట్లు సీబీఐ వారు తేల్చారని అన్నారు. అంటే గంగిరెడ్డి అవినాష్ డైరక్షన్లో చేశారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి చెప్పకనే చెబుతున్నారని బీటెక్ రవి అన్నారు.