టీడీపీ ప్రచారంలో వైసీపీ కవ్వింపు చర్యలు- అరుపులు, కేకలతో రెచ్చగొట్టే ప్రయత్నం - Bode Prasad Campaign in Vuyyuru - BODE PRASAD CAMPAIGN IN VUYYURU
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 1, 2024, 10:30 PM IST
Bode Prasad Election Campaign Provoked Jogi Ramesh Son: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఉయ్యూరు కూడలిలోని వైసీపీ కార్యాలయం వద్దకు బోడే ప్రసాద్ కాన్వాయ్ రావటంతో అక్కడే ఉన్న రాజీవ్ పెద్ద ఎత్తున కార్యకర్తలను మోహరించాడు. కాన్వాయ్ పక్కగా ప్రచార మైకులతో ఉన్నటువంటి వాహనాలను నిలిపి పెద్ద ఎత్తున శబ్దాలు చేశారు.
వైసీపీ కార్యకర్తల అరుపులు, కేకలతో జెండాలను ఊపుతూ టీడీపీ నేతలను రెచ్చగొట్టారు. అదే సమయంలో రాజీవ్ తన కారు వద్దకు వచ్చి తొడగొట్టి చేతులు ఊపారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసులు టీడీపీ నేతలు మాత్రమే వెళ్లిపోవాలని ముఖం జారీ చేస్తూ వైసీపీ నేతలకు మాత్రం ఏ విధమైన హెచ్చరికలు ఇవ్వలేదు. దీంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు.