విష జ్వరాల కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం : రఘునందన్‌ రావు - RAGHUNANDAN RAO SLAMS CONGRESS

🎬 Watch Now: Feature Video

thumbnail

Raghunandan rao Slams Congress : రాష్ట్రంలో డెంగీ వంటి విష జ్వరాలు విజృంభించి ప్రజలు మరణిస్తుంటే, ప్రభుత్వం మాత్రం ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం, ఎవరిని పీసీసీని చేద్దామనే ధ్యాసలో ఉందని మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సమీక్షలు నిర్వహించకుండా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిల్లీకి చక్కర్లు కొడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని రఘునందన్‌రావు దుయ్యబట్టారు. ఒకే రోజు ఐదుగురు డెంగీతో మృతి చెందినట్లు దినపత్రికల్లో వచ్చిందని, విష జ్వరాల కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆరోగ్య శాఖపై, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో సౌకర్యాలపై సమీక్ష నిర్వహించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కులగణన పేరుతో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం చూస్తోందని ఆయన విమర్శించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుంటే, కేంద్రం నుంచి నిధులు ఆగిపోతాయని రఘునందన్‌ రావు తెలిపారు. వీలైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.