ఐదేళ్లలో జగన్ దోచింది కొండంత ప్రజలకు పంచింది పిసరంత: లంకా దినకర్ - Lanka Dinakar Comments on YCP - LANKA DINAKAR COMMENTS ON YCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 7:29 PM IST
BJP Leader Lanka Dinakar Fire on YSRCP Government: రాష్ట్రంలో జగన్ దోచింది కొండంత ప్రజలకు పంచింది పిసరంత అని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి కుటుంబం నెత్తిన 10 లక్షల రూపాయలు అప్పు భారం మోపిందని విమర్శించారు. జగన్ ఐదు సంవత్సరాల పాలనతో విసిగిపోయిన ప్రజలు ఈ నెల 13న ఓటుతో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. స్టార్ట్ అప్, స్టాండ్ అప్, డిజిటల్ ఇండియా, ఎమ్ఎస్ఎమ్ఈల ప్రోత్సాహకాలతో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
యువత, మహిళల అభివృద్ధితోనే వికసిత్ భారత్ - వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధ్యమని అన్నారు. బీసీల కష్టాలను తెలుసుకున్నది మోదీ ప్రభుత్వమేనని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఎలాంటి నిధులు కేటాయించలేదని విమర్శించారు. 56 కులాలకు కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా ఆయా కులాలను అవమానించారని శ్రీనివాస్ మండిపడ్డారు.