భూమన కరుణాకర్రెడ్డిని టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలి - ఈసీకి బీజేపీ ఫిర్యాదు - BJP Complaint on Bhumana - BJP COMPLAINT ON BHUMANA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-04-2024/640-480-21201326-thumbnail-16x9--bjp-complaint-on-bhumana.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 11, 2024, 7:36 PM IST
BJP Complaint on Bhumana Karunakara Reddy : టీటీడీ ఛైర్మన్ హోదాలో ఉంటూ వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలని కోరుతూ బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి సీఈఓ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఆయన తనయుడికి టికెట్ ఇప్పించుకున్న కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ హోదాలో ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని భానుప్రకాశ్ రెడ్డి తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో టీటీడీ ఉద్యోగులకు వేతనాలు పెంచేలా ఆయన నిర్ణయం తీసుకుని అధికార పార్టీకి పరిస్థితులు అనుకూలించేలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తక్షణం టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని తప్పించాలని ఈసీని కోరారు.
మరోవైపు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో అప్పటి రిటర్నింగ్ అధికారి లాగిన్ నుంచి అక్రమంగా డౌన్ లోడ్ చేసిన 38,493 నకిలీ ఎపిక్ కార్డులను తొలగించాలని కోరుతూ తిరుపతికి చెందిన జె. రవీంద్రదాస్ కూడా మరో ఫిర్యాదు ఇచ్చారు. ప్రస్తుతం తిరుపతిలోని ఓటర్ల జాబితాలో 38,493 మంది ఒకే రకమైన ఐడెంటికల్ ఓటర్లు ఉన్నట్టు గా అయ్యిందని, అక్రమంగా ఎపిక్ కార్డులు డౌన్ లోడ్ చేసినట్టు కేసు నమోదైనా ఇప్పటికీ ఆ ఓట్లను తొలగించలేదని బీజేపీ జనసేన పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.