ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి-అమరావతి గర్వంగా నిలబడుతుంది: భువనేశ్వరి - Bhuvaneshwari Tweet On NDA Govnt - BHUVANESHWARI TWEET ON NDA GOVNT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-06-2024/640-480-21738086-thumbnail-16x9-bhuvaneshwari-tweet-on-nda-government.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 18, 2024, 5:11 PM IST
|Updated : Jun 18, 2024, 5:30 PM IST
Bhuvaneshwari Tweet On NDA Government in Andhra Pradesh : 'నిజం గెలవాలి' పర్యటనలో ప్రజల బాధలు చూశానని, నేడు కూటమి విజయంతో రాష్ట్రంలో ప్రజలు తామే గెలిచామన్న సంతోషాన్ని చూశానని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే వస్తాయన్నారు. కౌరవ సభ స్థానంలో గౌరవ సభ కొలువవుతోందని తెలిపారు. గౌరవ సభతో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయని స్పష్టం చేశారు. రాజధాని రైతుల పోరాటం వృధా కాలేదన్నారు. చంద్రబాబు పాలనలో అమరావతి రాజధానిగా మళ్లీ గర్వంగా నిలబడుతుందని భువనేశ్వరి పేర్కొన్నారు. ప్రతి వర్గానికి, ప్రాంతానికి మంచి చేయాలనే చంద్రబాబు సంకల్పం నెరవేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి పని చేసిన కూటమి కార్యకర్తలకు తగిన గౌరవం దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఫోటోలను భువనేశ్వరి ఎక్స్ వేదికగా పంచుకున్నారు.