అక్కడ క్వారీ తవ్వకాలు ఎలా చేపడతారు ? - గ్రామస్థుల ఆందోళన - People Protest Against Quarry
🎬 Watch Now: Feature Video
Bhogapuram People Protest Against Quarry in Vizianagaram District : విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం రామచంద్రపేట గ్రామం పరిధిలో అనుమతులు ఇవ్వని భూముల్లో పనులు ఎలా మొదలు పెడతారంటూ సమీప మూడు గ్రామాల ప్రజలు నిరసనలు తెలిపారు. ఇప్పటికే మూడు క్వారీల ద్వారా తమ గ్రామంలో ఉన్న ప్రజలు నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న క్వారీల్లో పరిమితికి మించి తవ్వకాలు చేస్తుండడంతో పేలుళ్ల ధాటికి ఇళ్లలో స్లాబు పెచ్చులూడి కింద పడుతున్నాయని అన్నారు.
జీఎంఆర్ సంస్థ విమానాశ్రయ నిర్మాణం కొరకు ప్రజాభిప్రాయ సేకరణ జరిగి వారం రోజులు కూడా కాకుండానే ఆ స్థలంలో క్వారీ తవ్వకాలు ఎలా ప్రారంభిస్తారని సమీప గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వారీలు పరిమితి తవ్వడం సమీప ప్రాంతాలు కాలుష్యంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక గ్రామ ప్రజలకు ప్రాణాపాయం ఉందని, నేతలు స్పందించకపోతే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.