మార్కాపురానికి అనుకోని అతిథులు - సెల్ఫోన్లో బంధించిన ప్రజలు - Beautiful Birds in Markapuram Pond
🎬 Watch Now: Feature Video
Beautiful Abroad Birds in Markapuram Pond in Prakasam District : ప్రకాశం జిల్లా మార్కాపురం చెరువులో విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి చెరువులో ఉన్న కొద్ది పాటి నీళ్లలో ఆ పక్షులు గుంపులు గుంపులుగా వచ్చి చేరాయి. దీంతో ఈ అనుకోని అతిథులను చూసి అటుగా వెళ్తున్న పక్షుల ప్రేమికులు, స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. రకరకాల రంగుల్లో నీళ్లలో తేలియాడుతున్న దృశ్యాలను రహదారిన వెళ్లే వారు వాహనాలు ఆపి మరీ తమ ఫోన్లలో బంధించుకుంటున్నారు.
ప్రతీ ఏటా అక్టోబరు, నవంబరు నెలల్లో సైబీరియా, నైజీరియా, ఆస్ట్రేలియా, కజకిస్తాన్ దేశాల నుంచి వేలాదిగా పక్షులు వస్తాయి. నేలపట్టులో సంతానోత్పత్తి చేసి మార్చిలో తిరిగి స్వస్థలాలకు వెళ్తుంటాయి. ప్లెమింగోలతోపాటు వచ్చే గూడబాతులు, నత్తగుల్ల కొంగలు, తెల్ల కంకణాయిలు, నీటికాకులకు పులికాట్ సరస్సు ఆహార కేంద్రం. షార్‌లో రాకెట్ ప్రయోగాల సందర్భంగా సందర్శకులకు అవకాశం కల్పిస్తుండటంతో పక్షులను తిలకించడానికి వచ్చే వారి తాకిడి పెరిగింది.