తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు బాలకృష్ణ అభిమానులు రక్తదానం - Blood Donate Thalassemia Children - BLOOD DONATE THALASSEMIA CHILDREN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 4, 2024, 6:00 PM IST
Balakrishna Fans Blood Donate to Suffering Thalassemia Children : తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిమానులు దత్తత తీసుకొని రక్తాదానం కార్యక్రమం చేపట్టారు. నందమూరి మోక్షజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో కర్నూలులో బాలకృష్ణ అభిమానులు రక్తదానం చేశారు. నందమూరి బాలకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాల స్ఫూర్తితో రక్తదాన కార్యక్రమం సంవత్సరం పూర్తి చేసుకుందని అభిమానులు తెలిపారు. దీంతో అక్కడ ఉన్న పిల్లలతో కలసి బాలకృష్ణ అభిమానులు కేకు కట్ చేశారు.
ప్రతి నెల చిన్నారులకు రక్తదానం చేస్తున్నామని వివరించారు. సంవత్సరానికి 60 మంది పిల్లలకు రక్తదానం చేస్తున్నామని అభిమానులు తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తామని అభిమానులు తెలిపారు. వచ్చే నెలలో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుండటంతో ఆయన పేరు మీద ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అభిమానులు పేర్కొన్నారు. ఈ అవకాశం లభించడం మా అదృష్టంగా భావిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో మరి కొంతమంది పిల్లలకు సహాయం చేస్తామని తెలిపారు.