మూడు రాజధానులు కడతామని ప్రజలను మోసం చేశారు: బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు గురునాథం - YSRCP Government Looted Money - YSRCP GOVERNMENT LOOTED MONEY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-04-2024/640-480-21295806-thumbnail-16x9-bahujan-parirakshana-samithi-president-gurunadham-fires-on-ysrcp-gov.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 23, 2024, 7:05 PM IST
Bahujan Parirakshana Samithi President Gurunadham Fires On Ysrcp Gov: జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, కొడాలి నాని, నందిగం సురేష్ అమరావతిని అడ్డం పెట్టుకుని సర్వం దోచేశారని బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు, 3 రాజధానుల శిబిరం మాజీ నిర్వాహకుడు మాదిగాని గురునాథం మండిపడ్డారు. 3రాజధానులు పేరు చెప్పి ప్రవాసాంధ్రుల నుంచి 400 కోట్లు వసూలు చేసి వారే దోచేశారని ఆరోపించారు.
Gurunadham Allegations on YSRCP Government Looted Money: 3రాజధానులు ఉద్యమం తానే (గురునాథం) చేయిస్తున్నట్లు సజ్జల జగన్ను నమ్మించి ఇసుక ర్యాంప్ నజరానాగా పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3రాజధానుల ఉద్యమ నేతలకు ఇళ్ల స్థలాలు, 25లక్షలు, కార్లు ఇస్తామని ట్రాప్ చేసి ఆశ చూపారని విమర్శించారు. 3 రాజధానులు శిబిరానికి వచ్చే ఒక్కొక్కరికీ 500 ఇస్తున్నట్లు దొంగ లెక్కలు రాసి ఆ డబ్బు కూడా నందిగం సురేష్, సజ్జల, కొడాలి నాని కూటమి దోచేసిందని గురునాథం దుయ్యబట్టారు. జగన్ ఓటమే లక్ష్యంగా బహుజనులంతా పని చేస్తామని గురనాథం స్పష్టం చేశారు. ఎన్నికల తరువాత అధికారంలోకి రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.