విజన్ అంటే ఏంటో తెలియని జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది : నారాయణ - Babu Surety Program
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 12:05 PM IST
Babu Surety Bhavisyathuku Guarantee Programme: రాష్ట్రాభివృద్ది కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu) ఒక విజన్‌తో పాలన సాగిస్తే, విజన్ అంటే ఏమిటో తెలియని జగన్(Jagan) పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ(TDP Leader Narayana) విమర్శించారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు(Nellor) నగరం పొర్లుకట్ట ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం మేనిఫెస్టో కరపత్రాలను నారాయణ పంపిణీ చేశారు.
ముందు చూపు లేని జగన్ పాలనలో పేద ప్రజలు కష్టపడుతున్నారని, ఇటీవల టిడ్కో ఇళ్లు ఇస్తామని లబ్ధిదారులను పిలిచి కొంతమందికే పట్టాలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. టీడీపీ- జనసేన అధికారం చేపట్టిన వెంటనే అర్హులైన వారికి టిడ్కో ఇళ్లు అందిస్తామన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఉన్న నారాయణను బీసీ సంఘం నేతలు కలిశారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు. బీసీ సంఘం డిమాండ్లను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని నారాయణ తెలిపారు.