బాబూ జగ్జీవన్ రామ్ బయోపిక్ చిత్రీకరణ ప్రారంభం - BABU JAGJIVAN RAM BIOPIC MOVIE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2024, 2:04 PM IST
Babu Jagjivan Ram Biopic Movie : బాబూ జగ్జీవన్ రామ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా చిత్రీకరణ గుంటూరు జిల్లా తెనాలిలో ప్రారంభమైంది. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రానికి ప్రభుత్వ సహాయసాకారాలు ఉంటాయని చెప్పారు. ఈ బయోపిక్ ప్రజల్లో మంచి స్ఫూర్తిని, చైతన్యాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఇందులో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్రలు నటిస్తున్నారు.
ఈ సినిమాలో మిలటరీ ప్రసాద్ ప్రధానపాత్ర పోషిస్తున్నారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ పాత్రల్లో నటించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యేలు రామాంజనేయులు, విజయచంద్రలు పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ చిత్రాన్ని ప్రజలకు అంకితం చేసేందుకు దర్శకుడు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆకాంక్షించారు. మొత్తం ఆరుగురు ప్రజాప్రతినిధులు ఈ సినిమాలో నటిస్తున్నారని దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పోషించిన సన్నివేశాలు, రాజకీయ నేపథ్యం, తదితర స్ఫూర్తిదాయకమైన అంశాలను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు వివరించారు.