ఆధారాల్లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు: ఎంపీ అవినాష్‌రెడ్డి - Avinash React on Sunitha Comments - AVINASH REACT ON SUNITHA COMMENTS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 7:46 PM IST
Avinash Reddy React on Sunitha Comments in Viveka Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత తనపై ఆధారాల్లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలతో నరకం అనుభవిస్తున్నానని కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్నారు. రాత్రి పడుకున్న తరువాత వాట్సప్ యాక్టివ్‌గా ఉందని, అంత మాత్రాన వాట్సప్‌లో యాక్టివ్‌గా ఉన్నానని ఆరోపిస్తున్నారని తెలిపారు. సీబీఐ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని ఆరోపించారు.
సీబీఐ ఆరోపణల ఆధారంగా సునీత మీడియా సమావేశం పెట్టి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కేసు వల్ల తన కుటుంబం ఇబ్బందుల పాలైందని తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా తన పరువుకు నష్టం కలిగేలా ఆరోపణలు చేస్తున్నారని వాపోయాడు. రాజశేఖరరెడ్డి మరణ అనంతరం తన తండ్రి పులివెందుల సీటు కోరినట్లు వస్తున్న ఆరోపణలను అవినాష్ ఖండించారు. తన తండ్రి ఎప్పుడూ సీట్ల కోసం పాకులాడలేదని వెల్లడించారు. వివేకా హత్య జరిగే చివరి రోజుల్లో తన కోసం పని చేశారని తెలిపారు. సునీత, సీబీఐ కలిసి వివేకా ఇంట్లో పనిచేసే వారితో తప్పుడు వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం చేశారని అవినాష్ రెడ్డి ఆరోపించారు.