వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ భవనాలకు నోటీసులు - అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలన్న అధికారులు - Authorities Notices
🎬 Watch Now: Feature Video
Authorities Notices to YSRCP District Office Buildings: వైఎస్సార్సీపీ నాయకులు చేపట్టిన అనధికారిక నిర్మాణాలపై వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నగరపాలక సంస్థ ప్రణాళిక విభాగం అక్రమ నిర్మాణాలను ఆపాలని నోటీసులు జారీ చేస్తోంది. కడపలో వైఎస్సార్సీపీ అక్రమంగా నిర్మిస్తోన్న జిల్లా కార్యాలయానికి నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు పేరు మీద టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు అంటించారు. ఏడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని చెప్పారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనకాపల్లి మండలం కొత్తూరు నర్సింగరావుపేటలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ భవనానికి అధికారులు నోటీసులు అంటించారు. ఐదు రోజుల్లోగా సమాధానం చెప్పాలని అధికారులు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కాపు సామాజిక భవనానికి కేటాయించిన భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించినా పోలీసులతో వారిని అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీకి అనేక సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలోనైనా అక్కడ కాపు సమాజిక భవనాన్ని నిర్మించాలని స్థానికులు కోరుకుంటున్నారు.