అధికారుల అత్యుత్సాహం- చంద్రబాబు నివాసం వద్ద పసుపు రంగు బల్లలు ధ్వంసం - Yellow Tables Destroy CBN house

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 18, 2024, 2:46 PM IST

Authorities Destroyed Yellow Tables in Chandrababu House: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (TDP Leader Chandrabau Naidu) నివాసం వద్ద అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎన్నికల కోడ్​ అమలు నేపథ్యంలో పసుపు రంగు బల్లలు(Yellow Tables) ఉన్నాయంటూ వాటిని ధ్వంసం చేశారు. చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చే కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా లోకేశ్​ సిమెంట్ బల్లలను ఏర్పాటు చేయించారు. అయితే ఆ బల్లలు పసుపు రంగులో ఉన్నాయంటూ అధికారులు వాటిని కూల్చేశారు. 

ఎన్నికల కోడ్‌కు అడ్డంకిగా భావిస్తే పసుపు రంగు బల్లల మీద సున్నం పూస్తే సరిపోయేది కదా అని తెలుగుదేశం నేతలు అంటున్నారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలపై జగన్ బొమ్మ ఉన్నా పట్టించుకోని అధికారులు అందరూ కూర్చునే బల్లలపై కక్ష గట్టి పడగొట్టారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నారా లోకేశ్(Nara Lokesh)​ను లక్ష్యంగా చేసుకొని అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.