పొలం గట్టు వివాదం - దాడులతో అట్టుడికిన వెంకటనాయునిపల్లి - Attacks and Counter Attack - ATTACKS AND COUNTER ATTACK
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 8, 2024, 11:39 AM IST
Attacks and Counter Attacks in Venkatanayaunipalli : నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటనాయునిపల్లి దాడులు, ప్రతిదాడులతో అట్టుడికింది. గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచి మాధవయ్య, వైఎస్సార్సీపీకి చెందిన ఇంద్రప్ప పొలం గట్టు విషయంలో గత కొంతకాలంగా వివాదం నెలకొంది. ఆదివారం సాయంత్రం (జులై 7న) మాధవయ్య పొలం దగ్గరికి వెళుతుండగా ఇంద్రప్ప కాపుకాసి కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటనలో మాధవయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మాధవయ్యపై హత్యాయత్నానికి ప్రతీకారంగా ఆయన వర్గీయులు ఇవాళ తెల్లవారుజామున ఇంద్రప్ప ఇంటిపై దాడి చేశారు. పక్కనే ఉన్న ఆయన సోదరులు చెన్నయ్య, ప్రభాకర్ నాయుడు ఇళ్లపైనా దాడి చేసి రెండు బైకులకు నిప్పు పెట్టారు. ఈ దాడిలో ఇళ్లలోని సామగ్రి, టీవీలను ధ్వంసం చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితిని అదుపు చేశారు. ఈ సంఘటనతో గ్రామంలో భారీగా పోలీసుల బలగాలను మోహరించారు.