thumbnail

సీతారాముల కల్యాణానికి ముస్తాబైన ఒంటిమిట్ట- లక్షమంది భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లు - ARRANGEMENTS FOR SITARAMA KALYANAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 6:25 PM IST

Updated : Apr 22, 2024, 6:19 AM IST

Arrangements For Vontimitta Sitarama Kalyanam: రెండో అయోధ్యగా పేరొందిన వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముడి కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8గంటల వరకు రాములోరి కల్యాణం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శాశ్వత కళ్యాణ మండపంలో లక్ష మంది భక్తులు వీక్షించే విధంగా సౌకర్యాలు కల్పించారు. వేద పండితుల సమక్షంలో సీతారాముల కల్యాణం జరగనుంది. 

సీతారాములకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించనున్నారు. వేదిక ప్రాంగణంలో భారీ ఎల్​ఈడీ తెరలను అధికారులు ఏర్పాటు చేశారు. కల్యాణ మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతోపాటు సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సీతారాముల కల్యాణ ఏర్పాట్లపై ఒంటిమిట్ట కల్యాణ వేదిక నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీ అందిస్తారు.

Last Updated : Apr 22, 2024, 6:19 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.