రామోజీరావు సంస్మరణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పార్థసారథి - Ramoji Rao Memorial Service - RAMOJI RAO MEMORIAL SERVICE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 23, 2024, 10:29 PM IST

Arrangements for Memorial Service of Ramoji Rao: ఈనాడు సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావు సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. సంస్మరణ కార్యక్రమం ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి పార్థసారథి సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం సభాస్థలాన్ని, పార్కింగ్ ప్రదేశాలను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీ జరగనుంది. ఈ కార్యక్రమం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప 100 అడుగుల రోడ్డులో ఉన్న చైతన్య మహిళా జూనియర్ కళాశాల వద్ద నిర్వహించనున్నారు. కార్యక్రమ నిర్వహించుటకు చేయవలసిన ఏర్పాట్లపై మంత్రి పార్థ సారథి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రామోజీరావు జీవిత విశేషాలు, పత్రికా రంగానికి ఆయన చేసిన సేవలపై ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు సంస్మరణ కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో గ్రీన్‌ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.