ప్రజల జీవితాలతో చెలగాటమాడిన వైఎస్సార్సీపీకి తగిన బుద్ధి చెప్పారు: ఏపీటీఎఫ్ - APTF Leaders on YSRCP Govt
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 6, 2024, 4:44 PM IST
APTF Leaders Allegations on YSRCP Government: అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు, ప్రజల జీవితాలతో చెలగాటమాడిన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఓటర్లు తగిన రీతిలో బుద్ధి చెప్పారని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ మంజుల (APTF state president CH Manjula) అన్నారు. సంస్కరణల పేరిట విద్యారంగాన్ని సర్వనాశనం చేయడంతో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని తెలిపారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను పరిష్కారించాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగులను, ఉపాధ్యాయుల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీసం పౌరులుగా కూడా చూడలేదని ఏపీటీఎఫ్ నేతలు మండిపడ్డారు. నాడు, నేడు పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని, ఖాళీగా ఉన్న పోస్టులతో మెగా డీఎస్సీని విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులకు ఒకటవ తేదrన జీతాలు ఇవ్వడం ప్రభుత్వ విధి అని చెప్తూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు ఎప్పుడు ఇస్తున్నారో వారికే తెలియలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.