ఏపీ శాట్ డైరెక్టర్ వేధింపులు - నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ఉద్యోగి - APSSAAT Employee Suicide
🎬 Watch Now: Feature Video
APSSAAT Employee Suicide Attempt in Guntur District :రాష్ట్ర సామాజిక తనిఖీ కేంద్రంలో (APSSAAT) పనిచేసే ఉద్యోగిని శిరీష రాణి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీ శాట్ సంచాలకులు జగదీష్ నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని బాధితురాలు శిరీష ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ బావమరిది జగదీష్ గత నెల 12న ఏపీ శాట్ సంచాలకులుగా పదవీ విరమణ చేశారు. తన పలుకుబడి ఉపయోగించి మూడు నెలలు పొడిగించుకున్నారు. ఆయన మళ్లీ బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి కార్యాలయంలో ఉద్యోగులపై వేధింపులు ఎక్కువ అయ్యాయని బాధితురాలు శిరీష తెలిపారు. అసభ్య పదజాలంతో దూషించేవారని, మాట వినకపోతే ఇంటికి వచ్చి మరి బెదిరింపులకు గురి చేసేవారని బాధితురాలు పేర్కొంది. జగదీష్‌పై కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వేధింపులు తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించానని చెప్పారు.