వారంలోగా మాచ్ఖండ్లో జలవిద్యుత్ ఉత్పత్తి- ఏపీజెన్‌కో సన్నాహాలు - APGENCO officers inspected Machkund - APGENCO OFFICERS INSPECTED MACHKUND
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 11, 2024, 3:21 PM IST
APGENCO Officers Inspected Machkund Hydro Power Station : ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని ఏపీ జెన్‌కో(APGENCO) ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. మూడు రోజుల కిందట విద్యుత్ కేంద్రంలోకి వరద ప్రవేశించి విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయింది. దీంతో సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీర్ వాసుదేవరావు, విద్యుత్ సౌధ నుంచి ఇద్దరు ఎస్ఈ(SE)ల బృందం ప్రాజెక్ట్ను సమీక్షించారు. విద్యుత్ కేంద్రంలో నీరు ప్రవేశించడానికి గల కారణాన్ని, జరిగిన నష్టాన్ని ప్రాజెక్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీరు ప్రవేశించి విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయి మూడు రోజులు గడిచిపోయినందున విద్యుత్తు ఉత్పాదన పునరుద్దించడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీర్ వాసుదేవరావు మాట్లాడుతూ "భారీ వర్షాలతో మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రలోకి వరద ప్రవేశించింది. దీంతో మూడు రోజులుగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. జోలాపుట్, డుడుమా జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గు ముఖం పట్టిన తరువాత టర్బయిన్‌ఫ్లోర్‌లో నీటిని బయటకు తోడి దశల వారిగా జనరేటర్లను వినియోగంలోకి తీసుకువస్తాం. నీటిని బయటకు తోడేందుకు ఒడిశా అగ్నిమాపక సిబ్బంది సహాయం తీసుకుంటాం. వారంలోగా నిలిచిపోయిన విద్యుత్ ఉత్పాదన పునరుద్ధరిస్తాం" అని తెలిపారు.