అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు- ఆశావహులతో షర్మిల ముఖాముఖి - AP Political news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 12:25 PM IST

APCC Chief Sharmila Meet With Congress Aspirants: సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. రాబోయే ఎన్నికల్లో(AP Elections 2024) టికెట్​ కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహులతో రెండు రోజులపాటు చర్చల కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావహులతో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ముఖాముఖి(APCC Chief Sharmila Interview) నిర్వహించారు. 

YS Sharmila Interview with Aspirants: విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆశావహులతో ఆమె చర్చలు నిర్వహించారు. సమావేశంలో నర్సాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని ఆశావహులు పాల్గొన్నారు. ఈ పార్లమెంటు స్థానాల పరిధిలోని 49 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు దరఖాస్తులు చేసుకున్న 280 మందితో ఆమె చర్చలు జరిపారు. బుధవారం అర్ధరాత్రి 1గంట వరకు ఈ ప్రక్రియ సాగింది. ఇవాళ మరో 9 పార్లమెంటు స్థానాల పరిధిలోని 63 అసెంబ్లీ నియోజకవర్గ ఆశావహులతో ఆమె చర్చలు జరపనున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.