'సంక్షేమం, అభివృద్ధి కాంక్షించే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సిద్ధం' - ap voters in Hyderabad - AP VOTERS IN HYDERABAD
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 8, 2024, 12:17 PM IST
AP Software employees in Hyderabad comments on Elections : ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వారికే ఓటు వేస్తామని యువ ఓటర్లు తేల్చిచెబుతున్నారు. 13న జరిగే ఎన్నికలకు సొంతూళ్లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉవ్విళ్లూరుతున్నారు. కొందరు సొంత వాహనాల్లో వెళ్లి ఓటు వేసేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు అధిక ఛార్జీలు, సరిపడా బస్సులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజా సంక్షేమం,అభివృద్ధి కాంక్షించే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు గుంతలుగా ఉన్నాయి, కొత్త ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాని మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న వ్యక్తి తెలిపారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి జరిగితే యువతకు ఉద్యోగావకాశాలు ఎక్కువవుతాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధాకారం చేపట్టాక ఐటీ రంగ పురోగతిపై దృష్టి సారించాలని ఓ మహిళా ఓటరు ఆకాంక్షించారు.