ఎంచుకున్న లక్ష్యంపై దృష్టి - మొక్కవోని దీక్షతో సివిల్స్​లో విజయం - AP CANDIDATES IN UPSC CIVILS - AP CANDIDATES IN UPSC CIVILS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 8:08 AM IST

AP Rankers in UPSC Civils Results 2024 : దేశ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్స్​ సర్వీసెస్​ పరీక్ష - 2023లో తెలుగు తేజాలు సత్తా చాటారు. మంగళవారం విడుదలైన యూనియన్​ పబ్లిక్​ సర్వీసెస్​ సివిల్స్​ ఫలితాలలో అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన నిమ్మనపల్లి ప్రదీప్ రెడ్డి, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వినీషా బడభాగ్ని విజయ కేతనం ఎగురవేశారు. ప్రదీప్ రెడ్డి జాతీయస్థాయిలో 382వ ర్యాంకు సాధించగా, వినీషా 821వ ర్యాంక్ పొందారు.

ప్రదీప్ రెడ్డి తండ్రి సహదేవరెడ్డి అధ్యాపకుడిగా పని చేస్తుండగా తల్లి కళావతి ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వైద్యరంగంపై ఆసక్తి ఉన్నా ప్రజలకు సేవలందించాలనే లక్ష్యంతోనే సివిల్స్​కు సన్నద్ధం అయ్యారని ప్రదీప్​రెడ్డి పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిరంతరం కృషి చేయడం ద్వారానే లక్ష్యసాధన సాధ్యమవుతుందని తెలిపారు. ఇష్టపడి చదవడంతోనే సివిల్ ర్యాంకు సాధించానని వినీషా చెప్పారు. సివిల్స్​లో వినీషా మూడు సార్లు అపజయం ఎదురైనా అధైర్యపడకుండా మొక్కవోని దీక్షతో సొంతంగా పరీక్షకు సన్నద్ధమై విజేతగా నిలిచారు. వినీషా సీఆర్డీఏలో మున్సిపల్​ కమిషనర్​గా పని చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.