విచారణకు వచ్చిన తెలంగాణ పోలీసులపై గ్రామస్థుల దాడి - Attack on police
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 24, 2024, 7:14 PM IST
|Updated : Feb 25, 2024, 9:11 AM IST
AP People Attack on Telangana Police in YSR District : విచారణ కోసం వచ్చిన తెలంగాణ పోలీసులపై వైఎస్సార్ జిల్లాలో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. జిల్లాలోని మైదుకూరు మండలం చిన్నయ్యగారిపల్లెలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైదుకూరు ఎస్సై మద్దిలేటి తెలిపిన వివరాల ప్రకారం, చిన్నయ్యగారిపల్లెకు చెందిన శివ, సాంబయ్య ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలోని నల్లొండ జిల్లా చందంపేటలో రూ. 40 లక్షలు అప్పు చేసి గొర్రెలను కొనుగోలు చేశారు. ఆ నగదు చెల్లించకపోవడంతో గొర్రెల యజమాని చందంపేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు కోసం చిన్నయ్యగారిపల్లెకు చందంపేట పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎసై సతీష్‌తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఫిర్యాదుదారుడు ఇన్నోవా కారులో చేరుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులకు శివ, సాంబయ్యతో పాటు గ్రామంలోని మరికొందరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు, ఫిర్యాదుదారునిపై నిందితులు, వారి కుటుంబసభ్యులు దాడి చేసి, కారు అద్దాలు ద్వంసం చేశారు. సంఘటనపై మైదుకూరు పోలీస్‌స్టేషన్‌లో చందంపేట ఎస్ఐ సతీష్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.