LIVE: ఏపీ శాసన మండలి సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - AP Legislative Council Sessions - AP LEGISLATIVE COUNCIL SESSIONS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 10:05 AM IST

Updated : Jul 25, 2024, 1:12 PM IST

AP Legislative Council Sessions Live : ఆంధ్రప్రదేశ్​లో శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం, గడచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం శాంతిభద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరును మండలిలో వివరించనున్నారు. జగన్‌ ఏలుబడిలోని అక్రమ కేసులు, నిర్బంధకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు వంటి అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించనున్నారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించనున్నారు.ఈ మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత శాసనమండలిలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రశ్నోత్తరాల్లో ప్రైవేటు ఏజన్సీలకు మోనజైట్ సిలికాన్‌ల అనధికార విక్రయం, రాష్ట్రంలో ఇ-వ్యర్థాల తొలగింపు, 2023 -2024 మధ్యకాలంలో ధాన్యం సేకరణ, నిత్యావసరాల ధరల పెరుగుదల, పంటల బీమా బకాయిల చెల్లింపు, రైతులకు పెట్టుబడి సాయం, మంగంపేట బెరైటీస్ గనులలో అక్రమాలు, పులివెందుల గృహనిర్మాణ ప్రాజెక్టులో అనర్హులైన లబ్ధిదారులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. 
Last Updated : Jul 25, 2024, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.