LIVE: రాజ్‌భవన్‌ 'ఎట్‌ హోమ్‌' కార్యక్రమంలో గవర్నర్​ తేనేటి విందు - ప్రత్యక్ష ప్రసారం - Abdul Nazeer AT HOME Program - ABDUL NAZEER AT HOME PROGRAM

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 5:01 PM IST

Updated : Aug 15, 2024, 6:06 PM IST

AP Governor Justice Abdul Nazeer AT HOME Program Live : స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఎట్‌ హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ తేనీటి విందు కార్యక్రమంలో సతీసమేతంగా ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు హాజరయ్యారు. తేనీటి విందు కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.  గవర్నర్​గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బాధ్యతలు తీసుకున్న తరువాత మూడవసారి ఈ కార్యక్రమం జరుగుతోంది. గత సంవత్సరం ఫిబ్రవరిలో జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ రాష్ట్ర గవర్నర్​గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.రాజ్‌భవన్‌ 'ఎట్‌ హోమ్‌' : ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నాతాధికారులకు రాష్ట్ర గవర్నర్​ ఇచ్చే తేనేటి విందు కార్యక్రమాన్ని రాజ్‌భవన్‌ 'ఎట్‌ హోమ్‌' అని పిలుస్తారు. ఈ కార్యక్రమానికి అందరూ ఒకేసారి హాజరవుతారు.   
Last Updated : Aug 15, 2024, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.