సజ్జల, ధనుంజయరెడ్డి చెబితేనే వింటాం అన్న ధోరణిలోనే ఉన్నతాధికారుల తీరు: సుర్యనారాయణ - Suryanarayana on Govt Officials - SURYANARAYANA ON GOVT OFFICIALS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 25, 2024, 10:36 PM IST
Suryanarayana Fire on Govt Officials Behavior: ప్రభుత్వం మారినా ఉన్నతాధికారుల తీరు మారలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంగం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ (AP Govt Employees Association leader Suryanarayana) అన్నారు. ఇప్పటికీ ధనుంజయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే తప్ప తాము పనిచెయ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులపై గత జగన్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపించి న్యాయం చేయాలని చంద్రబాబును కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాలపై ఉద్యోగులు ఇచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రిటైర్డ్ హైకోర్టు జడ్జ్‌తో కమిషన్ వేయాలని సూర్యనారాయణ కోరారు. ప్రాథమిక ఆధారాలు వాస్తవమని తేలితే బాద్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్థికశాఖ, ఉద్యోగుల సమస్యల్ని ప్రశ్నించినందుకే తనపై కేసులు పెట్టి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల తరఫున పోరాడుతున్నందుకు అణిచివేయాలని చూశారని మండిపడ్డారు. ఏ కేసు పెట్టారో చెప్పకుండా విచారణకు పిలిచేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌లు ఇంతలా దిగజారడం ఎప్పుడూ చూడలేదని సూర్యనారాయణ అన్నారు.