LIVE: వైఎస్ షర్మిల మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - YS Sharmila Press Meet
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 10, 2024, 12:07 PM IST
|Updated : Mar 10, 2024, 12:28 PM IST
AP Congress Chief YS Sharmila Press Meet: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆంధ్రరత్న భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే షర్మిల సీఎం జగన్ మోహన్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు. ఓట్ల కోసం ప్రత్యేకహోదా వాగ్దానం చేసి, రాష్ట్ర రూపురేఖలు మారుస్తానని జగన్ హామీ ఇచ్చారని, రాష్ట్ర ప్రజల హక్కులో ఏ ఒక్కటైనా సాధించారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలన్న జగన్ ఒకటైనా నిర్మించారా అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా ఇవ్వకుండా పదేళ్లుగా తల్లి ఆంధ్రాను మోదీ చంపుతూనే ఉన్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామా చేస్తామన్న జగన్ ఏమయ్యాడని, మూకుమ్మడి కాదు కదా ఒక్కరు కూడా రాజీనామా చేయలేదన్నారు. పులి అన్న జగన్ ఏమయ్యాడని ఎద్దేవా చేశారు. మోదీ చెప్పిన ప్రతి వ్యాపారికి జగనన్న అన్ని చేశాడని ఆరోపించారు. ప్రత్యేక హోదా గురించి ఒక ఎంపీ అయినా మాట్లాడారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో తాజాగా షర్మిల ఏం మాట్లాడతారో అనే దానిపై ఆసక్తి నెలకొంది. షర్మిల మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Mar 10, 2024, 12:28 PM IST