thumbnail

LIVE : జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం నుంచి ఎన్టీఆర్‌ భవన్‌ వరకు ర్యాలీ- ప్రత్యక్ష ప్రసారం - AP CM Chandrababu Rally

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 11:15 AM IST

Updated : Jul 7, 2024, 1:10 PM IST

AP CM Chandrababu Rally in Hyderabad LIVE : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్​ పర్యటనలో భాగంగా తెలంగాణ టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీని నిర్వహించారు. దిల్లీ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజులు పాటు హైదరాబాద్​ పర్యటించారు. రాష్ట్ర విభజన అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అంశాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు శనివారం ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని టీడీపీ అభిమానులు ఇవాళ జూబ్లీహిల్స్​లోని చంద్రబాబు నివాసం నుంచి ఎన్టీఆర్​ భవన్​ వరకు పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో బోనాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఎన్టీఆర్​ భవన్​లో చంద్రబాబుకు సన్మానం చేయనున్నారు. ఈ ర్యాలీలో టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.
Last Updated : Jul 7, 2024, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.