LIVE : ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail
AP Assembly Sessions Live : ఆరో రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రవేశ పెట్టిన ఏడు బిల్లులపై సభలో చర్చ జరుగుతోంది. పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ , మున్సిపల్ చట్టసవరణ బిల్లును మంత్రి నారాయణ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఆయుర్వేదిక్, హోమియోపతి, వైద్య ప్రాక్టీస్ చేసే వారి రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లులను మంత్రి సత్య కుమార్ యాదవ్, ల్యాండ్ గ్రాబింగ్ చట్ట సవరణ బిల్లును మంత్రి అనగాని సత్యప్రసాద్, సహకార సోసైటీల చట్ట సవరణ బిల్లుని మంత్రి అచ్చెన్నాయుడులు ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ జరగుతోంది. వివిధ శాఖలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులను సంబంధిత మంత్రులు సభలో ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని 8 డివిజ‌న‌ల్, 4 రైల్వే జోనల్ క‌మిటీల‌కు సంబంధించిన స‌భ్యుల ఎన్నిక‌ తీర్మానం చేయనున్నారు. రైల్వే జోన‌ల్, డివిజనల్​కు యుజ‌ర్ క‌న్సల్టెవ్ క‌మిటీలకు స్థానిక శాసన సభ్యులను ఎన్నుకునేందుకు తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. రెండేళ్ల కాలానికి స‌భ్యుల‌ను ఎన్నుకునేలా అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. రహదారుల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి ఈ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.