ETV Bharat / state

రేషన్‌ బియ్యం మాయం కేసు - పేర్ని నానిపై కేసు నమోదు - POLICE CASE ON PERNI NANI

పీడీఎస్ బియ్యం మాయం కేసులో ఏ6గా పేర్ని నాని - అరెస్ట్​ చేస్తారనే ఊహాగానాలతో ముందస్తు బెయిల్​ పిటిషన్​ - విచారణ సోమవారానికి వాయిదా

Police case on Perni Nani
Police case on Perni Nani (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2024, 12:26 PM IST

Updated : Dec 31, 2024, 3:03 PM IST

Police Case on Perni Nani : రేషన్‌ బియ్యం మాయం వ్యవహారంలో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. ఆయణ్ని ఏ6గా బందరు తాలూకా పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టై రిమాండ్​లో ఉన్న నలుగురు నుంచి సేకరించిన సమాచారం మేరకు పేర్ని నాని పేరును A-6గా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నాని ఆదేశాల మేరకే మిల్లర్ నుంచి లారీ డ్రైవర్‌కు, లారీడ్రైవర్ నుంచి నిందితులకు నగదు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ పే, ఆన్‌లైన్ బ్యాంకు లావాదేవీలను సేకరించారు.

బియ్యం మాయం కేసులో పోలీసులు కేసు నమోదు చేయడం ఇదే సమయంలో అరెస్టు చేస్తారన్న ఊహాగానాలతో పేర్ని నాని కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని స్వీకరించిన హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు ఆదేశించింది.

Perni Nani Ration Rice Case : మరోవైపు రేషన్‌ బియ్యం మాయం కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారికి మచిలీపట్నంలోని స్పెషల్‌ మొబైల్‌ జడ్జి 12 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో నిందితులను మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధను ఏ1గా పోలీసులు పేర్కొన్నారు. ఆమెకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే అరెస్టైన నలుగురు నిందితుల్లో గోదాము మేనేజర్‌ మానస్ తేజ, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్‌ మేనేజర్‌ కోటిరెడ్డి, రైస్‌ మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్‌ బోట్ల మంగరాజు ఉన్నారు.

వైఎస్సార్సీపీ పాలనలో జయసుధ పేరిట గోదామును పేర్ని నాని నిర్మించారు. దాన్ని పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఇటీవల ఆ గిడ్డంగిని అధికారులు తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలోనే బియ్యం నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించారు. పెద్ద ఎత్తున రేషన్ బియ్యం మాయమైనట్లు తేల్చారు. గోదాము మేనేజర్‌ మానస్‌తేజ, పౌరసరఫరాల అధికారి కోటిరెడ్డి మిగిలిన ఇద్దరి బ్యాంకు ఖాతాల లావాదేవీల్లో సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30లక్షల మేర లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగానే మిగిలిన నిందితులను గుర్తించినట్లు సమాచారం. మరోవైపు పేర్ని నాని కుటుంబంలోని పలువురి ఖాతాలకు కూడా మానస్‌తేజ ఖాతా నుంచి డబ్బు (రూ.లక్షల్లో)లావాదేవీలు జరిగాయని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.

పేర్ని నాని గోదాములో బియ్యం మాయం కేసు - పోలీసుల అదుపులో కోటిరెడ్డి

రేషన్ బియ్యం కేసు - దూకుడు పెంచిన పోలీసులు - పేర్ని నాని సతీమణికి మరోసారి నోటీసులు

Last Updated : Dec 31, 2024, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.