LIVE: ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం
🎬 Watch Now: Feature Video
AP Assembly Sessions 2024 LIVE : నేడు శాసనసభలో టిడ్కో గృహాలపై లఘు చర్చ జరగనుంది. టిడ్కో ఇళ్లలో కాంట్రాక్టర్లు, లబ్ధిదారులు నష్టపోయిన తీరుపై చర్చించనున్నారు. వివిధ శాఖలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులకు శాసనసభ ఆమోదం తెలపనుంది. ఇటీవల కాలంచేసిన మాజీ శాసనసభ్యుల కుటుంబాలకు అసెంబ్లీ సంతాపం ప్రకటించనుంది. కెంబూరి రామ్మోహనరావు , పాలపర్తి డేవిడ్ రాజు, రుద్రరాజు సత్యనారాయణ రాజు , అడుసుమిల్లి జయప్రకాశ్, మాగుంట పార్వతమ్మ, ఎడ్డీ సత్యనారాయణల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టనున్నారు.'కన్న తల్లి శీలాన్ని శంకించే వారు మనుషులా, పశువులా? తల్లి వ్యక్తిత్వాన్నే హననం చేసేవారికి మనం ఒక లెక్కా? కన్న తల్లిపైనా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే ఏమనుకోవాలి? గత ఐదు సంవత్సరాలల్లో ఏపీలో సోషల్ మీడియా సైకోలను తయారు చేశారు' అని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం, అప్పులపై అసెంబ్లీలో శుక్రవారం చంద్రబాబు ప్రసంగిస్తూ ఎన్డీఏ కూటమిలోని నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ అసభ్య పోస్టులు పెట్టరని తెలిపారు. ఒకవేళ పెడితే వారినీ శిక్షిస్తాం స్పష్టం చేశారు. ఆడబిడ్డలు గౌరవంగా బతికేలా చేస్తామని, రాబోయే రోజుల్లో ఏ ఆడబిడ్డా అవమానపడడానికి వీల్లేదని, చట్టానికి పదును పెట్టి కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు.