ప్రమాదవశాత్తు నీటిలో మునిగి - అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి - Software Employee Died in America - SOFTWARE EMPLOYEE DIED IN AMERICA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-08-2024/640-480-22240094-thumbnail-16x9-software-employee-died.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 19, 2024, 8:59 AM IST
Andhra Software Employee Died in America : ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అమెరికాలో మృతి చెందారు. ముండ్లమూరు గ్రామానికి చెందిన దొద్దాల బుచ్చిబాబు (40) కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. వారాంతం కావడంతో కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి బీచ్‌కు వెళ్లారు. అక్కడ సరదాగా ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అతను నీటిలో మునిగిపోయాడు. ఈ విషయం గమనించి అతని భార్య కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు సాహసం చేసి బుచ్చిబాబును బయటకు తెచ్చారు. కొన ఊపిరితో ఉన్న అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయారని వారి బంధువులు తెలిపారు.
ఎన్నో ఆశలతో విద్యాబుద్ధులు నేర్పించి, ప్రయోజకుని చేసి, కుటుంబానికి వెన్నెముకగా నిలిచిన తమ కుమారుడు ఇంకా లేడు అన్న విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ముండ్లమూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అమెరికాలోని తానా అధ్యక్షుడితో మాట్లాడి మృతదేహాన్ని భారత్ రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.