ఉపాధి హామీ కూలీలకు దొరికిన పురాతన బాక్స్ - 25 వెండి నాణేలు, రెండు ఉంగరాలు లభ్యం - SILVER COINS FOUND IN SIDDIPET
🎬 Watch Now: Feature Video
Published : May 30, 2024, 1:23 PM IST
Ancient Silver Coins Found in Siddipet District : సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామంలో ఉపాధి హామీ పని చేస్తుండగా కూలీలకు వెండి నాణేల కుండ లభ్యమైంది. ఉపాధి పనుల నిమిత్తం పొలాలకు వెళ్లి కాల్వలు తవ్వుతున్న సమయంలో ఓ మహిళకు ఓ చిన్న బాక్స్ దొరికింది. దానిని తెరిచి చూడగా లోపల వెండి నాణేలు, ఉంగరాలు లభించాయి. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పూర్వకాలంలో రాజులు వాడిన నాణేలుగా వాటిని అనుమానిస్తున్నారు.
Silver Coins Found in Siddepet : స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్ఠలానికి చేరుకొన్న పోలీసులు ఆ మహిళ నుంచి బాక్స్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. వాటిని ఉపాధి కూలీల సమక్షంలోనే లెక్కించారు. సుమారు 25 నాణేలు, రెండు ఉంగరాలు లభించినట్లు తెలిపారు. ఈ నాణేలను పురావస్తుశాఖ అధికారులకు అప్పగిస్తామన్నారు. పూర్వ కాలంనాటి నాణేలు ఇప్పుడు లభ్యం కావడంతో గ్రామస్తులు వాటిని చూడడానికి ఎగబడ్డారు. ఆ నాణేలను పట్టుకుని సంతోషపడ్డారు.