అప్పులపాలైన రాష్ట్రాన్ని అన్ని విధాలా గాడిన పెట్టడానికే కూటమిగా ఏర్పడ్డాం: నల్లమిల్లి రామకృష్ణారెడ్డి - Nallamilli Ramakrishna Interview - NALLAMILLI RAMAKRISHNA INTERVIEW
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 9, 2024, 11:48 AM IST
Anaparthy BJP MLA Candidate Nallamilli Ramakrishna Reddy Interview : నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో ఉన్న తమ కుటుంబం అనూహ్య పరిస్థితుల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నా ప్రజలు అమితంగా ఆదరిస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సీటు వస్తుందో రాదో అన్న డైలమాలోనూ కార్యకర్తలు, అనుచరులు తనను వీడకుండా మరింత అక్కున చేర్చుకున్నారని తెలిపారు. అప్పుల పాలైన రాష్ట్రాన్ని అన్ని విధాలా గాడిన పెట్టడానికే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయని మరోసారి గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే మూడు పార్టీలు అందరి అజెండా అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గడపకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే సూపర్ సిక్స్, మ్యానిఫెస్టోను రూపొందించారని అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇలా అన్ని తరగతుల వారికి మేలు జరగనుందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
Andhra Pradesh Elections 2024 : అయిదేళ్ల కష్టాల నుంచి విముక్తి కోసం నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారని, బటన్ నొక్కి అధికార పార్టీ అరాచక పాలనకు ముగింపు పలకనున్నారని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో అనపర్తి నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలపై ప్రజల పక్షాన పోరాడిన తీరు ఈ ఎన్నికల్లో తనకు విజయాన్ని సమకూరుస్తుందని అన్నారు. అనపర్తిలో ఘన విజయం సాధించి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటామంటున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి.