రైతులకు సాగునీరు అందించడంలో జగన్ ప్రభుత్వం విఫలం: కొణతాల రామకృష్ణ - Konatala Ramakrishna
🎬 Watch Now: Feature Video
Alliance Leader Konatala Ramakrishna Comment on YCP Government : రైతులకు సాగు నీరు అందించడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని అనకాపల్లి లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి కొణతాల రామకృష్ణ విమర్శించారు. అనకాపల్లిలో శారదా నదిపై నిర్మించిన గ్రోయిన్ల మరమ్మతులకు గురికావడంతో స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. శారదా నదిపై మొత్తం 11 చోట్ల గ్రొయిన్లు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. వీటికి మరమ్మతులు చేపడితే సుమారు 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి సాగునీటి కోసం చిన్న చిన్న మరమ్మతులను కూడా చేయలేని పరిస్థితిల్లో ఉన్నాడని కొణతాల రామకృష్ణ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం రైతుల అభివృద్ధికి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని సీఎం జగన్ గొప్పలు చెబుతూ ఉంటారని మండిపడ్డారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పంట పొలాలకు సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రొయిన్ల మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందిస్తామని రైతులకు కొణతాల హామీ ఇచ్చారు.