ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో కూటమి అభ్యర్థి? - Alliance Candidate in MLC Elections
🎬 Watch Now: Feature Video
Alliance Candidate in MLC By Elections: ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టే యోచనలో కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ దక్షిణ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో వీడి జనసేనలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దాంతో వంశీ కృష్ణపై అనర్హత వేటు పడి ఖాళీ ఏర్పడింది. వైఎస్సార్సీపీ ఇప్పటికే తమ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైఎస్సార్సీపీని వీడి చాలా మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు కూటమిలో చేరటంతో ఎన్నికల బరిలో నిలవాలని తెలుగుదేశం అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ ఉపఎన్నికలో మొత్తం 822 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. ఉపఎన్నికకు ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. కూటమి అభ్యర్థిని పోటీకి నిలబెట్టే యోచనపై విశాఖలో ఎమ్మెల్యేలు, ఎంపీ సీఎం రమేశ్ కీలక సమావేశం నిర్వహించారు. ఇవాళ రేపట్లో దీనిపై తుదినిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.